: నా ఓటమికి అసలు కారణమిదే!: శిల్పా మోహన్ రెడ్డి
తన అనారోగ్యం కారణంగా ప్రచారంలో సరిగ్గా తిరగలేకపోయానని, తన ఓటమికి అసలు కారణం ఇదేనని వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలనూ తాను స్వయంగా వెళ్లి కలవాలని భావించినప్పటికీ, అది సాధ్యం కాలేదని, ఈ కారణంతోనే ఓడిపోతున్నానని ఆయన విశ్లేషించారు.
నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుండగా, అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు తనను ప్రత్యేకంగా కలిసిన ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, వైఎస్ జగన్ తన గెలుపు కోరుతూ ఎంతో శ్రమించారని, ఇకపై ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడతానని, ప్రజా తీర్పును తాను గౌరవిస్తానని చెప్పారు.