: నంద్యాల ఓటర్లు జగన్ కు మంచి గుణపాఠం చెప్పారు: మంత్రి అచ్చెన్నాయుడు


నంద్యాల ఓటర్లు జగన్ కు మంచి గుణపాఠం చెప్పారని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత జగన్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారని అన్నారు. జగన్ ఇప్పటికైనా తన ధోరణి మార్చుకుని హుందాగా వ్యవహరిస్తేనే ప్రజలు నమ్ముతారని అన్నారు. ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలో టీడీపీ ఆధిక్యం కనబరచడంపై అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉపఎన్నికల ఫలితాలతోనైనా జగన్ కళ్లు తెరవాలని, ముఖ్యమంత్రిని తిడితే ఓట్లు పడవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, టీడీపీకి అఖండ విజయాన్ని అందించనున్న ప్రజలకు తన ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల వల్లే ఈ విజయాన్ని అందుకోనున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News