: ఎనిమిదో రౌండ్ లో టీడీపీకి స్వల్ప ఆధిక్యత!
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఎనిమిదో రౌండ్ లో టీడీపీకి 348 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీకి 17,228 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా, ఏడో రౌండ్ లో స్వల్ప ఆధిక్యం కనబరిచిన టీడీపీ, ఎనిమిదో రౌండ్ లోనూ అదే తీరులో ఆధిక్యం కనబరిచింది. అయితే, వరుసగా 8 రౌండ్లలో టీడీపీ ఆధిక్యం కనబరచడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా భూమా వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.