: ఏడో రౌండ్ లోనూ టీడీపీ జోరు!
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో టీడీపీ ఆధిక్యం కొనసాగింది. తాజాగా, ఏడో రౌండ్ లోనూ తన ఆధిక్యతను టీడీపీ నిలబెట్టుకుంది. అయితే, 512 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీడీపీ ఆధిక్యత సాధించడం గమనార్హం. కాగా, ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీికి 16,880 ఓట్ల ఆధిక్యం లభించింది.