: గోవా ఉప ఎన్నికల్లో పారికర్ విజయం... రాజ్యసభకు రాజీనామా!


గోవా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విజయం సాధించారు. బీజేపీ తరఫున పనజి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, తన సమీప అభ్యర్థిపై 4,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రక్షణ మంత్రిగా ఉన్న పారికర్, గోవా అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రానికి సీఎంగా వచ్చిన సంగతి తెలిసిందే. తన గెలుపు తరువాత పారికర్ మాట్లాడుతూ, గోవాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని అన్నారు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నానని, వచ్చే వారంలో ఢిల్లీకి వెళ్లి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News