: ఓడిపోతే నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా: శిల్పా మోహన్ రెడ్డి


నంద్యాల ఉపఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాలలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న పాలిటెక్నిక్ కళాశాలలోకి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఎగ్జిట్ పోల్స్ ను తాను నమ్మనని, ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని భూమా అఖిలప్రియ అన్నారని, ఆమె  ఆ మాట మీద నిలబడి  ఉంటే... ఓడిపోతే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.  ఆమె ఆ మాటమీదే  ఉండాలని అన్నారు. తమ గెలుపు విషయంలో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. భారీగా పోలింగ్ నమోదు కావడంతోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతోందని అన్నారు. 

  • Loading...

More Telugu News