: నంద్యాలలో విస్తృత భద్రతా ఏర్పాట్లు!
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మరికొంచెం సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 మంది డీఎస్పీలు, 18 మంది సీఐలు, 63 మంది ఎస్సైలు, 58 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 232 మంది కానిస్టేబుళ్లు, 18 మంది మహిళా కానిస్టేబుళ్లు, 12 స్పెషల్ పార్టీలు, 118 మంది హోంగార్డులు, స్ట్రైకింగ్ ఫోర్స్ 5, ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ 3, మొబైల్ పార్టీలు 12, ఒక సీఆర్పీఎఫ్ కంపెనీ, 4 ఏపీఎస్పీ ప్లాటూన్లు, 21 పికెట్లతో కలిపి 600 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. అయితే, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన షామియానాలు వర్షానికి తడిసి పోయాయి.