: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరు?


కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి సహచరుడు, ప్రజారాజ్యం నుంచీ ఆయనతో కలిసి పనిచేస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి రామచంద్రయ్య కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చిరంజీవి తగిన నేతగా రామచంద్రయ్య ఈ రోజు విజయవాడలో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చిరంజీవిపై ఎక్కువగా ఆధారపడే అవకాశాలున్నాయని అన్నారు. చిరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగితే తప్పేంటని ఫ్రశ్నించారు.

రామచంద్రయ్య నిన్న విశాఖలోనూ చిరుపై ఇలానే వల్లమాలిన అభిమానం కురిపించారు. "చిరంజీవి గారూ మీరు సిద్దంగా వుండండి. రాష్ట్ర ప్రజలు మీవైపే చూస్తున్నారు. మీరు, పీసీసీ చీఫ్ బొత్స సత్యన్నారాయణ కలిసి రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజల ఆకాంక్ష" అని రామచంద్రయ్య విశాఖ, బీమిలి కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిరును ఆకాశానికెత్తేశారు.

  • Loading...

More Telugu News