: మొదట్లోనే టీమిండియాకు వికెట్ల నష్టం!


మూడో వన్డేలో 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (5) మలింగా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కోహ్లీ కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ఫెర్నాండో బౌలింగ్ లో చమీరాకు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లీ వెనుదిరగాల్సి వచ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భాగస్వామ్యం కొనసాగుతోంది. రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఫోర్లు బాదాడు. 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు.. 19/2.

  • Loading...

More Telugu News