: కాకినాడలో టీడీపీకి మద్దతు పలికిన కులసంఘాలు
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పలు కుల సంఘాల మద్దతు టీడీపీకి లభించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేశాయి. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రస్తుతం కాకినాడలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును 12 కులాలకు చెందిన నేతలు ఈ రోజు కలిశారు. ఆయా కుల సంఘాల నేతలను చంద్రబాబు విడివిడిగా కలిశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అన్ని వర్గాల ప్రజలను పైకి తీసుకువచ్చి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పని చేస్తున్న విషయాన్ని వారికి చంద్రబాబు చెప్పారు. దీంతో, ఈ ఎన్నికల్లో తమ మద్దతు టీడీపీకే ఇస్తామని ఆయా కుల సంఘాల నేతలు చంద్రబాబుకు తెలిపారు.