: నటి సంజనను రూ. 28 లక్షలకు మోసం చేసిన చిట్ ఫండ్ కంపెనీ


కర్ణాటకలో 'ప్రసిద్ధి' చిట్ ఫండ్స్ అనే కంపెనీ సుమారు 250 మందిని మోసం చేసి రూ. 18 కోట్లను నొక్కేయగా, అందులో 'బుజ్జిగాడు', 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ సంజన కూడా ఉంది. చిట్ ఫండ్స్ నిర్వాహకులు తనను రూ. 28 లక్షలకు మోసం చేశారని, దీనిపై తాను సోషల్ మీడియా మాధ్యమంగా పోరాడుతున్నానని చెప్పింది.

 "నేను ప్రభుత్వాన్ని, చట్టాలను నమ్ముతున్నాడు. ఇతరులు ఎవరో చెబితే నేనీ కంపెనీలో చేరలేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ కాబట్టే చేరాను. ఇప్పుడు ప్రభుత్వంపై నమ్మకం పోయింది" అని 'న్యూస్ 9' ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజన వ్యాఖ్యానించింది. తాను ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు చాలా తేలికగా తీసుకున్నారని ఆరోపించింది. రెండు నెలల క్రితం చిట్ ఫండ్ నిర్వాహకులు కంపెనీని మూసివేశారని, భార్యా భర్తలు నిరుపా మహేష్, రవికుమార్ లతో పాటు చిట్ ఫండ్ కంపెనీ ఏజంట్లు హేమలతా, రంగస్వామి, శ్రీకాంత తదితరులు ఎందరో ఈ స్కామ్ లో భాగస్వాములని పేర్కొంటూ వారి ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి, వారెక్కడున్నా పోలీసులకు పట్టించాలని కోరింది.

  • Loading...

More Telugu News