: ఖైదీ నంబర్ 1977గా గుర్మీత్... ఏసీ పెట్టించలేదన్న అధికారులు


అత్యాచార ఆరోపణల్లో దోషిగా తేలి, ప్రస్తుతం రోహ్ తక్ జైల్లో ఉన్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు జైల్లో నంబర్ 1997ను కేటాయించామని అధికారులు తెలిపారు. ఆయనకున్న జడ్ ప్లస్ భద్రతను తొలగించిన తరువాత, హెలికాప్టర్ లో జైలుకు తరలించిన అధికారులు, ఏ విధమైన ప్రత్యేక సదుపాయాలనూ కల్పించలేదని స్పష్టం చేశారు. ఆయన కోసం ఏసీ ఏర్పాటు చేశారని, మినరల్ వాటర్ నుంచి సకల సదుపాయాలనూ కల్పించారని, అసిస్టెంట్లను పక్కనే ఉంచారని వచ్చిన ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. గుర్మీత్ ను సాధారణ ఖైదీల్లానే పరిగణిస్తున్నామని, వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని హర్యానా ముఖ్య కార్యదర్శి డీఎస్ దేశీ వెల్లడించారు.

 కాగా, శుక్రవారం నుంచి గుర్మీత్ జైల్లో ఉండగా, ఆయన అభిమానులు జరుపుతున్న హింసాకాండలో మరణించిన వారి సంఖ్య 37కు చేరుకుంది. మరో 250 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రేపు ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్షను విధించనున్న నేపథ్యంలో పంజాబ్, హర్యానాలు సహా ఐదు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News