: రాజకీయాలు ఎవడబ్బ సొమ్ము... నాలా ఎంఏ చేసినోళ్ల పేర్లు పది చెప్పండి?: పోసాని కృష్ణ మురళి
రాజకీయాలు ఒకడబ్బ సొత్తు అనుకుంటే కుదరదని, ఎవరైనా వచ్చి రాణించవచ్చని నటుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించాడు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమావాళ్లకు రాజకీయాలు అవసరమా? అన్న ప్రశ్నను ఎదుర్కొన్న ఆయన, "ఎవడబ్బ సొమ్ము రాజకీయాలు? నాలా ఎంఏ, ఎంఫిల్ చదివినోడు ఎవడున్నాడు? ఓ పది మంది పేర్లు చెప్పండి? జనం ప్రేమతో గెలిచిన ఈ ఎమ్మెల్యేలు... అని ఓ పది పేర్లు చెప్పండి. వీళ్లు ఆనెస్ట్ అని" అన్నాడు. సినిమావాళ్లల్లో డ్రగ్స్ బిజినెస్ ను చేస్తున్న వాళ్లు ఉంటారని తాను అనుకోవడం లేదని చెప్పిన పోసాని, తనకు మంచివాళ్లను ప్రేమించే పిచ్చ, చెడ్డవాళ్లను తిట్టే పిచ్చ ఉందని, ఇక తనను ఎటువంటి 'మెంటల్ కృష్ణ' అంటారో మీ ఇష్టమని చెప్పాడు.