: పుల్వామా దాడి మా పనే.. జైషే మొహమ్మద్ ప్రకటన


జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమపనేనని పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటించింది. ఈ దాడిలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. శనివారం పుల్వామాలోని పోలీస్ కాంప్లెక్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా సిబ్బంది అమరులు కావడంపై హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్ కౌంటర్ లో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News