: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను వెనకేసుకొచ్చిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్!
అత్యాచారం కేసులో నేరం రుజువై పోలీస్ కస్టడీలో ఉన్న డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వెనకేసుకొచ్చారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒక వ్యక్తిపై అత్యాచారం ఆరోపణలు వస్తున్నాయని, మరోవైపు ఆయనకు మద్దతుగా లక్షల మంది నిలిచారని అన్నారు. అంతమంది అభిప్రాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గుర్మీత్ రామ్ రహీం ప్రతిష్ఠను దెబ్బతీయడానికే, కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. గుర్మీత్ రామ్ రహీంను జైలుకి తరలించిన నేపథ్యంలో నిన్న పంజాబ్, హర్యానాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే.