: రియో ఒలింపిక్స్‌లో నేను పాల్గొన‌కుండా ఉండాల్సింది... సైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


రియో ఒలింపిక్స్‌లో పాల్గొకుండా ఉండాల్సింద‌ని ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ అంది. `రియో స‌మ‌యంలో నాకున్న స‌మ‌స్య‌ల గురించి నాకు మాత్ర‌మే తెలుసు. త‌ల్లిదండ్రులు, కోచ్‌లు మ‌ద్ద‌తివ్వడంతో ఫిజిక‌ల్‌గా ఫిట్‌గా ఉన్నాన‌ని అనుకున్నాను. కానీ వారి న‌మ్మ‌కం వ‌మ్ము అవుతుంద‌నుకోలేదు. నేను అస‌లు రియోకు వెళ్ల‌కుండా ఉండాల్సింది` అని సైనా అంది. మోకాలి గాయాల కార‌ణంగానే ఒలింపిక్స్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయాన‌ని, ఇప్ప‌టికీ త‌న కుడి మోకాలిలో స‌మ‌స్య ఉంద‌ని ఆమె పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఆమె సెమీస్‌కు చేరుకుంది. త‌ర్వాత జ‌పాన్‌కు చెందిన నోజోమి ఒకోహారాతో సైనా త‌ల‌ప‌డ‌నుంది.

  • Loading...

More Telugu News