: వెంకయ్య, నరసింహన్, చంద్రబాబుల సమీపంలో కుప్పకూలిన డ్రోన్.. తప్పిన ప్రమాదం!


ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, వెంకయ్యకు ఈ రోజు అమరావతిలో పౌర సన్మానం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి వీరు ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా బయల్దేరారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాతో కూడా చిత్రీకరణ జరిపారు.

వీరి ర్యాలీ ఏలూరు రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత రోడ్డు పక్కనున్న చెట్టు కొమ్మలో డ్రోన్ చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నిస్తుండగానే వీరి వాహనం అక్కడకు చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్ కుప్పకూలింది. ఇది వీరికి సమీపంలోనే పడిపోయింది. ప్రముఖులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో డ్రోన్ కొంచెం దెబ్బతింది. దీంతో, మరో డ్రోన్ ను తెప్పించి, చిత్రీకరణ జరిపారు.

  • Loading...

More Telugu News