: ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై నాని, శర్వానంద్ ప్రశంసల జల్లు!


హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డితోలతో కలసి హీరో శర్వానంద్ ఈ రోజు 'అర్జున్ రెడ్డి' సినిమాను చూశాడు. ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన సందీప్ రెడ్డిని ఆయ‌న కొనియాడాడు. సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తాను కూడా న‌టించాల‌నుకుంటున్నాన‌ని అన్నాడు. ఈ సందర్భంగా ఆ సినిమా టీమ్ తో తీసుకున్న ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు.

మ‌రో యువ క‌థానాయ‌కుడు నాని ఈ సినిమాపై స్పందిస్తూ అర్జున్ రెడ్డి సినిమా బృందానికి శుభాకాంక్ష‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నాడు. 2017 తెలుగు సినిమాకి క‌లిసి వ‌స్తోంద‌ని ట్వీట్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా బృందంపై ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించాడు.

  • Loading...

More Telugu News