: కాకినాడలో కోట్లు వెదజల్లామన్న రోజా వ్యాఖ్యలు నిజమే!: టీడీపీ ఎమ్మెల్యే అనిత చమత్కారం


కాకినాడలో టీడీపీ కోట్లు వెదజల్లిందంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాటలు అక్షర సత్యమని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమేనని... కాకినాడ అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. డబ్బిచ్చి ఓట్లు కొనుక్కోవలసిన దౌర్భాగ్యం టీడీపీకి లేదని అన్నారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి రోజా రావడంతో... టీడీపీ గెలుపు మరింత సులభంగా మారిందని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీల నేతలు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు రోజా, అనితల మధ్య చాలా కాలంగా విరోధం ఉన్న మాట తెలిసిందే. 

  • Loading...

More Telugu News