: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని వెంకయ్య నిరూపించారు: గవర్నర్ నరసింహన్
ఇవాళ గన్నవరం నుంచి వెలగపూడి సభావేదిక వరకు వెంకయ్య నాయుడి మీద ప్రజలు చూపిస్తున్న ప్రేమ తనకు `ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే` అనే సామెతను గుర్తు తెచ్చిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఒకప్పుడు విద్యార్థిగా విజయవాడలో వెంకయ్య వేసిన పోరాట గింజలు, ఈరోజు చెట్లుగా మారి ప్రజల ప్రేమ రూపంలో ఫలాలను ఇస్తున్నాయని ఆయన అన్నారు. తెలుగు ప్రజలకు శాంతి, సమృద్ధిని వెంకయ్య తీసుకువచ్చారని, విభజన సమయంలో ఆయన చేసిన కృషి తనకు మాత్రమే తెలుసునని గవర్నర్ తెలిపారు. క్రమశిక్షణకు మారు పేరైన వెంకయ్య ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆశీర్వదించారు.