: వేలకోట్ల ఆస్తులకు అధిపతి... డేరా బాబా గురించి ఆసక్తికర విషయాలు!
రేప్ కేసులో డేరా బాబా గుర్మీత్ సింగ్ ను సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన అనుచరులు తీవ్ర విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా స్పందించింది. డేరా బాబా భక్తులు చేస్తున్న దాడిలో ధ్వంసమవుతున్న ఆస్తులకు... ఆయన ఆస్తులను అమ్మి పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఆయన ఆస్తులపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఆశ్రమానికి వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
డేరా నూతన భవనం, పురాతన భవనం, అంతరాలయం, ఫైవ్ స్టార్ హోటల్, బిజినెస్ స్కూల్, కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వివిధ ఫ్యాక్టరీలు, ఎస్ఎంజీ ప్రాడక్ట్స్, ఫిల్మ్ సిటీ సెంటర్, మాహీ సినిమా, పంట పొలాలు, రెస్టారెంట్ ఇలా ఎన్నో డేరా బాబాకు ఉన్నాయి. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన 100 వరకు కార్లు ఉన్నాయి. వీటిలో ఆయన స్వయంగా పలు కార్లను డిజైన్ చేయించుకున్నారు. ఈ కార్లలోనే ఆయన భక్తుల మధ్య తిరుగుతుంటారు. అంతేకాదు ఆయన యాక్టర్, సింగర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ కూడా.