: సెమీస్‌కి దూసుకెళ్లిన సైనా, సింధు!
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లలో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో వారికి పతకాలు ఖాయం చేసుకున్నట్లైంది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూతో సింధు తలపడింది. మొదట్నుంచి చెలరేగి ఆడి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమెకు ఇది మూడో పతకం కానుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా సింధునే అవుతుంది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్.. స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే సెమీస్‌ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.