: నంద్యాల ముగిసింది.. కాకినాడపై కన్నేసిన టీడీపీ, వైసీపీ.. నేడు చంద్రబాబు ప్రచారం!


సెమీఫైనల్‌గా భావించిన నంద్యాల ఉప ఎన్నిక  పోరు ముగియడంతో ఇప్పుడు టీడీపీ, వైసీపీలు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపైనా అదే స్థాయిలో దృష్టిసారించాయి. గెలుపే ధ్యేయంగా ఇరు పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సెకెండ్ సెమీస్‌గా భావిస్తూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏడేళ్ల తర్వాత జరుగుతున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ నుంచి కాకినాడ చేరుకోనున్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం వరకు కాకినాడలో ప్రచారం చేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు వైసీపీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఎంపీ విజయసాయిరెడ్డి పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News