: జమ్ముకశ్మీర్‌లో మరోమారు రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసులే లక్ష్యంగా దాడులు.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఈ తెల్లవారుజామున పోలీసులపై దాడికి దిగారు. వారి దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ముగ్గురు స్థానిక పోలీసులు ఉన్నారు. టెర్రరిస్టులు మాటు వేశారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News