: గణేశ్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఘర్షణ... నంద్యాలలో మరోమారు కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు


నంద్యాల ఉప ఎన్నిక తర్వాత టీడీపీ, వైసీపీ మధ్య చెలరేగిన గొడవలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా గణేశ్ విగ్రహ ఏర్పాటు విషయంలో మరోమారు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని నూనెపల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వినాయక విగ్రహం ఏర్పాటు విషయంలో మొదలైన గొడవ ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

 టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ బాధితురాలు ఒకరు నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఇదంతా వైసీపీ నాటకమని, ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదు చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఫలితాలు వెలువడడానికి మరో రెండు రోజులే సమయం ఉండడంతో పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తమవుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News