: ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ‘రాజుగారి గది-2’ లోగో విడుదల!
అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో దర్శకుడు ఓంకార్ రూపొందించిన ‘రాజుగారి గది-2’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా లోగోను ఈ రోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నట్లు సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ లోగో విడుదల అవుతున్నందుకు ఎక్సైటింగ్ గా ఉందని నటి సమంత కూడా ట్వీట్ చేసింది. ఈ సినిమాను పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రల్లో నటించారు.