: ప్రియాంక గాంధీకి డెంగ్యూ... ఆసుప‌త్రిలో చేరిక‌!


కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకి డెంగ్యూ సోకింది. దీంతో ఆమెను ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆసుప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రియాంక ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా తెలిపారు. వర్షాల కార‌ణంగా ఢిల్లీలో బుర‌ద చేరి, డెంగ్యూ దోమ‌లు విజృంభిస్తున్నాయి. దీంతో డెంగ్యూ విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇప్ప‌టికి 657 మంది ఈ వ్యాధి బారినపడ‌గా, వారిలో 325 మంది ఒక్క ఢిల్లీ నగరానికి చెందినవారేన‌ని అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News