: అవినీతికి పాల్పడినందుకు శాంసంగ్ అధినేతకు ఐదేళ్ల జైలు శిక్ష
అవినీతి ఆరోపణలు రుజువైన కారణంగా శాంసంగ్ గ్రూప్ అధినేత లీ జే-యాంగ్‌కు దక్షిణ కొరియా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి అధ్యక్షురాలు పార్క్ గైన్ హై మద్దతు కోసం ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారనేది ఆయనపై ఉన్న ఆరోపణల సారాంశం. శాంసంగ్ సీ అండ్ టీ, కెయిల్ ఇండస్ట్రీస్ వివాదాస్పద విలీనానికి సంబంధించి 2015లో ప్రభుత్వ ఆమోదం కోసం ఆయన ఈ లంచాలు ఇచ్చారని ప్రధాన ఆరోపణ. ఈ విలీనాన్ని షేర్‌హోల్డర్ ఇలియట్ అసోసియేట్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. నిజానికి ఈ కేసులో 'లీ'కు 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. కానీ విచారణ అనంతరం ఆయనపై ఉన్న అన్ని కేసులకు కలిపి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. దీనిపై ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.