: ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు.. ఫ్యాక్షనిజం వద్దు: మంత్రి పరిటాల సునీత
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకుని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే నేత కాదన్నారు. నంద్యాల ప్రజలు ఆశ్చర్యపడేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. ఎవరూ ఊహించనంత మెజారిటీతో నంద్యాలలో గెలవబోతున్నట్టు మంత్రి జోస్యం చెప్పారు.