: హెచ్‌పీఈలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేరబోతున్న విశాల్ సిక్కా?
వ్యవస్థాపకులకు, అడ్మినిస్ట్రేషన్ బోర్డుకు మధ్య మనస్పర్థల కారణంగా ఇన్ఫోసిస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన విశాల్ సిక్కా, త్వరలో అమెరికన్ సంస్థ హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ) పగ్గాలు చేపట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. విశాల్ సిక్కాకు సీఈవో పదవి కంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగమే సరైనదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇంకా విశాల్ సిక్కా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. హెచ్‌పీఈ సంస్థలో రెండు లక్షల మంది ఉద్యోగులున్నారు. డేటా సెంటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను హెచ్‌పీఈ విక్రయిస్తోంది. మూడేళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరకముందు విశాల్ సిక్కా, జర్మన్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ఎస్‌ఏపీలో సీటీవోగానే బాధ్యతలు నిర్వర్తించేవారు.