: బెట్టింగుల్లో వైసీపీ వెనుకంజ‌... కార‌ణం ల‌గ‌డ‌పాటి స‌ర్వే!


నంద్యాల‌లో క‌చ్చితంగా టీడీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుంద‌ని ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ (ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే బృందం) వెల్ల‌డించడంతో బెట్టింగుల్లో వైసీపీ వ‌ర్గీయులు వెనుకంజ వేస్తున్నారు. మ‌రోప‌క్క టీడీపీ వాళ్లు పెద్ద మొత్తాల్లో బెట్టింగులు కాస్తున్న‌ట్లు తెలుస్తోంది. ‘ఎన్నికల సర్వేల్లో తిరుగులేదు’ అని పేరు తెచ్చుకున్న ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ (లగడపాటి రాజగోపాల్‌ తరఫున సర్వేలు నిర్వహించే సంస్థ) నంద్యాలలో ఎగ్జిట్‌ పోల్‌, పోస్ట్‌ పోల్‌ సర్వేల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

పోలైన ఓట్ల‌లో  టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 54-56.78 శాతం ద‌క్కుతాయ‌ని, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి 36-38.53 శాతం ఓట్లు పడతాయని వారి స‌ర్వే తెలిపింది. ఇక మైనార్టీ అభ్య‌ర్థిని బరిలోకి దింపిన కాంగ్రెస్ 3-4.49 శాతం ఓట్లను చీల్చే అవకాశముందని స‌ర్వే లెక్క‌క‌ట్టింది. దాదాపు 5 శాతం ఓట్ల‌ను చిన్న చిన్న పార్టీలు, స్వతంత్రులు సాధించుకుంటార‌ని వెల్ల‌డించింది. ప్రీ పోల్ స‌ర్వేతో పోల్చిన‌పుడు పోస్ట్ పోల్ స‌ర్వేలో టీడీపీ బలం మరింత పెరిగింద‌ని ఆర్జీస్ టీమ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News