: రాక్‌స్టార్ బాబాపై మరికాసేపట్లో తీర్పు.. 800 వాహనాలతో కోర్టుకు చేరుకోనున్న గుర్మీత్‌సింగ్.. 201 రైళ్లను రద్దు చేసిన రైల్వే!


మహిళా సాధ్వీలపై అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌సింగ్‌పై మరికాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనుంది. తీర్పు నేపథ్యంలో 800కు పైగా వాహనాలతో గుర్మీత్ సింగ్ కోర్టుకు చేరుకోనున్నారు. మరోవైపు గుర్మీత్ మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున పంచ్‌కులా చేరుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టిన పోలీసులు గుర్మీత్ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ పారా మిలటరీ దళాలను మోహరించిన కేంద్రం అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడాలని ఆదేశించింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల మీదుగా నడిచే 201 రైళ్లను భద్రతా కారణాల రీత్యా రైల్వే రద్దు చేసింది.

  • Loading...

More Telugu News