: `సైరా`లో న‌ర‌సింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్‌?


మెగాస్టార్ చిరంజీవి త‌దుప‌రి చిత్రం `సైరా న‌ర‌సింహ‌రెడ్డి`లో అమితాబ్ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పాత్ర‌కు సంబంధించి ఫిల్మ్ న‌గ‌ర్లో వివిధ ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందులో అమితాబ్ ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డికి గురువుగా నటించ‌నున్నార‌ని వినిపిస్తోంది. క‌థ‌లో ఎంతో కీలక పాత్ర అయితే మిన‌హా బిగ్‌బీ లాంటి పెద్ద హీరోని తీసుకోర‌ని, క‌చ్చితంగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిలో పోరాట స్ఫూర్తిని ర‌గిలించే గురువు పాత్ర కోసమే అమితాబ్‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంకా సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ సేతుప‌తిలు కీల‌క పాత్రల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News