: తిరుమలలో భారీ వర్షం.. రెండో ఘాట్‌రోడ్డులో జారిపడిన బండరాళ్లు.. స్తంభించిన ట్రాఫిక్
భారీ వర్షం కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై బండరాళ్లు జారిపడడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది. గత రాత్రి నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కడప, చిత్తూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లోని చాలా ప్రాంతాలు భారీ వర్షానికి నీట మునిగాయి. వాగులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.