: వైసీపీ చీఫ్ జగన్మోహన్రెడ్డికి స్వల్ప అస్వస్థత!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆయన 13 రోజులు ప్రచారం చేశారు. ఈ క్రమంలో వర్షంలోనూ తడిశారు. ఈ కారణంగానే ఆయనకు జలుబు, జ్వరం వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయనకు కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.