: జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో భారత్ నిర్మించనున్న రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరం
జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో భారత్ నిర్మించనున్న రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరం తెలిపింది. భారత్, చైనా, భూటాన్ సరిహద్దులోని డోక్లాంలో చైనా అక్రమంగా నిర్మిస్తోన్న రహదారి నిర్మాణాన్ని భారత్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడ్డగోలు వాదనలు చేసుకుంటూ వస్తోన్న చైనా తాజాగా లడఖ్ అంశంపై పలు వ్యాఖ్యలు చేసింది. లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో రహదారిని భారత్ ఎలా నిర్మిస్తుందంటూ విచిత్ర వాదన చేసింది.
చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హు చునీయింగ్ మీడియాతో మాట్లాడుతూ... భారత్ వైపు చేపట్టే రోడ్డు నిర్మాణం శాంతి, స్థిరత్వానికి అనుకూలమైనది కాదని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యల పట్ల భారత్ చేస్తున్న పనులు బాగోలేవని వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటూ శాంతిని నెలకొల్పాలని చైనా, భారత్ అంగీకారం తెలిపాయని, కానీ, భారత్ చేస్తున్న పనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.