: జియో 4జీ ఫోన్‌ బుకింగ్స్‌కు విశేష స్పందన.. వెబ్‌సైట్‌ క్రాష్‌


ఆన్‌లైన్‌లో రిల‌య‌న్స్ జియో 4జీ ఫోన్ బుకింగ్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. రిల‌య‌న్స్ జియో సిమ్ కార్డుకు అనూహ్య స్పందన వ‌చ్చిన‌ట్లే ఫోన్‌కి కూడా విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ రోజు 5.30గంటలకు జియో ఫ్రీ ఫోన్‌ బుకింగ్‌ ప్రారంభమ‌యిందే ఆల‌స్యం.. ఒక్క‌సారిగా ల‌క్ష‌లాది మంది ఆ ఫోన్‌ను బుక్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో జియో.కామ్‌ వెబ్‌సైట్‌ క్రాష్ అయింది. కంటెంట్‌ సర్వర్‌ ఎర్రర్‌ అని వ‌స్తుండ‌డంతో వినియోగ‌దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

ఈ ఫోన్ కోసం సుమారు 50కోట్ల మంది యూజర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వెబ్ ఓపెన్ చేస్తే ఫోన్‌ కొనుగోలుకు ఎటువంటి లింక్ క‌న‌ప‌డ‌డం లేద‌ని యూజ‌ర్లు వాపోతున్నారు. ఈ ఫోన్ బుక్ చేసుకోవాలంటే రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బును రిల‌య‌న్స్‌ జియో మూడేళ్ల త‌రువాత యూజ‌ర్ల‌కు తిరిగి ఇచ్చేస్తుంది. 

  • Loading...

More Telugu News