: నంద్యాల ఘటనపై అభిరుచి మధు ఫిర్యాదు మేరకు శిల్పా చక్రపాణి సహా 8 మందిపై కేసు నమోదు


నంద్యాలలోని హోట‌ల్ సూర‌జ్ గ్రాండ్ స‌మీపంలో ఈ రోజు టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇరుకైన ర‌హ‌దారిలో ఎదురుప‌డిన ఇరువ‌ర్గాలు, త‌మ వాహ‌నాలు నిలిపివేసి గొడ‌వ‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ నేత మ‌ధు నంద్యాల టూ టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న కారు వ‌ద్ద‌కు వ‌చ్చి వైసీపీ నేత‌లు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, శిల్పా అనుచ‌రుడు ఆదిరెడ్డి స‌హా ప‌లువురు దాడికి దిగారని మ‌ధు చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు. త‌న‌పై వారు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని మ‌ధు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో శిల్పా చ‌క్ర‌పాణి స‌హా 8 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

  • Loading...

More Telugu News