: దక్షిణాఫ్రికాలో భారత కుటుంబం పెళ్లి వివాదానికి తెర?


దక్షిణాఫ్రికాలో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంపన్న భారతీయ కుటుంబం క్షమాపణలు కోరింది. గుప్తా కుమారుడి పెళ్లి సందర్భంగా అతిధులతో కూడిన విమానం అనుమతులు లేకపోయినా ఒక సైనిక స్థావరంలో దిగడం, ఆ తర్వాత అక్కడి ప్రభుత్వ అశ్రిత పక్షపాతంపై విమర్శలు పెద్ద ఎత్తున రావడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పలు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. గుప్తా కుటుంబానికి అధ్యక్షుడు జాకబ్ జుమాతో సన్నిహిత సంబంధాలున్నాయి. అధికార ఎఎన్ సి పార్టీకి గుప్తా కుటుంబం భారీగా విరాళాలూ ఇస్తోంది. ఇందువల్లే గుప్తా కుటుంబం నిబంధనలను ఉల్లంఘించినా చూసీ చూడనట్లు ఊరుకున్నారని జుమా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో్ గుప్తా కుటుంబం దక్షిణాఫ్రికా, భారత్ రెండు దేశాలనూ.. మన్నించాలంటూ కోరింది.

  • Loading...

More Telugu News