: `విరాట్ విజయానికి కారణం నేనే!`... రామ్ రహీమ్ సింగ్ ప్రకటన... వీడియో చూడండి
ఆధ్యాత్మిక గురువు, గాయకుడు, నటుడు, దర్శకుడు అయిన రామ్ రహీమ్ సింగ్ తనకు మరో కళ కూడా ఉందని బయటపెట్టాడు. తాను క్రికెటర్లకు సలహాలు ఇవ్వడంలో నిపుణుడినని, తన సలహాల వల్లే విరాట్ కొహ్లీ ఇంతటి విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నాడని ఆయన చెబుతున్నాడు. విరాట్‌తో పాటు శిఖర్ ధావన్, నెహ్రా ఇంకా ఇద్దరు ముగ్గురు క్రికెటర్లు తన శిష్యులని ఆయన అంటున్నాడు. ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ రహీమ్ ఈ విషయాలు వెల్లడించాడు. అలాగే తన సలహాలకు కొహ్లీ చాలా సార్లు కృతజ్ఞతలు కూడా చెప్పాడని ఆయన అన్నాడు.