: 8 ఐటీ కంపెనీల‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఎనిమిది ఐటీ కంపెనీల‌ను ప్రారంభించారు. ఈ రోజు ప్రారంభించిన‌ ‘ఏపెక్స్‌’ కంటెంట్‌ సొల్యూషన్స్‌, వెంటర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌, ఐడీఏ ఆటోమేషన్‌, జీవా డిజిటల్‌ సర్వీసెస్‌, అవ్యా ఇన్‌వెట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్స్‌, అమ్‌జూర్‌ ఇన్ఫోటెక్‌, విస్మయ ప్రీమీడియా సంస్థల ద్వారా 770 మందికి ఉద్యోగాలు ద‌క్క‌నున్నాయి. విశాఖ‌ప‌ట్నంలోని రిషికొండ వద్ద 11 అంతస్తుల భవనాన్ని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఏటీ ఏజెన్సీ(ఏపీటా) అద్దెకు తీసుకుని కంపెనీలకు కేటాయించిందని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News