: జూనియర్ ఎన్టీఆర్ కు మరో బంపర్ ఆఫర్!
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో అదరగొడుతోంది. తొలుత ఈ షోపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచలేదు. ఒకరిద్దరు మినహా మిగిలినవారు అంత పేరున్నవారు కాకపోవడంతో... ప్రేక్షకులు కొంత అనాసక్తిని చూపించారు. అయితే, వీకెండ్స్ లో జూనియర్ ప్రత్యక్షమై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రేటింగ్ ను పెంచాడు. తాజాగా, కొత్త కంటెస్టెంట్ లు హౌస్ లోకి రావడం, ఉన్నవారు కూడా తమ తీరును మార్చుకోవడంతో... ప్రేక్షకాదరణ అమాంతం పెరిగిపోయింది.
బిగ్ బాస్ తెలుగు షో సూపర్ హిట్ అవడంతో స్టార్ మా చానల్ యాజమాన్యం ఆనందంగా ఉంది. సెకండ్ సీజన్ లో కూడా జూనియర్ నే హోస్ట్ గా పెట్టాలని దాదాపు ఖరారైపోయారట. ఈ విషయంపై ఇప్పటికే జూనియర్ తో చర్చలు కూడా జరిపారట. దీనికి, ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.