: ఎంతగానో ఎదురుచూస్తున్న రూ. 200 నోటు.. రేపే విడుదల
జనాలంతా ఎంతగానో ఎదురు చూస్తున్న రూ. 200 నోటు రేపే మార్కెట్లోకి వస్తోంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యంక్ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. నోటు వెనుక వైపున సాంచీ స్థూపాన్ని ముద్రించారు. మన దేశ అత్యున్నత సంస్కృతిని వెల్లడించే క్రమంలో సాంచీ స్థూపాన్ని నోటుపై ముద్రించారు. లేత పసుపు రంగులో ఈ నోటు వస్తోంది. ఈ నోటు రాకతో కరెన్సీ కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. మరోవైపు, రూ. 2వేలు, రూ. 500 నోట్ల సెక్యూరిటీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో... ఈ నోటు విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకున్నారు.