: బెంగళూరు వెళుతున్న 'యాత్రాజినీ' బస్సుకు ప్రమాదం... ముగ్గురి మృతి ... మరో ముగ్గురి పరిస్థితి విషమం... పదిమందికి గాయాలు!


యాత్రాజినీ.కామ్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తోంది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో నేటి తెల్లవారు జామున ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం దగ్గర లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సై డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో మరో పదిమందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేలింది.

  • Loading...

More Telugu News