: శ‌ర్వానంద్ `మ‌హానుభావుడు` టీజ‌ర్ విడుద‌ల‌... వీడియో చూడండి!


మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న `మ‌హానుభావుడు` చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` త‌ర్వాత మారుతి తీసిన `బాబు బంగారం` ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రుచించ‌లేదు. దీంతో `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` త‌ర‌హాలోనే ఇందులో కూడా హీరోకి ఒక ఆరోగ్య లోపం పెట్టారు. ఈ సినిమాలో హీరోకి `ఓసీడీ` (అబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే మానసిక వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు అతి చాదస్తంతో వుంటారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుండడం... అతి శుభ్రత పాటించడం వంటి లక్షణాలు వుంటాయి. దీంతో హీరో ప‌డే క‌ష్టాల ఆధారంగా క‌థ న‌డుస్తుంది. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టించింది. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

  • Loading...

More Telugu News