: దండలు మార్చుకుని వివాహం చేసుకున్న ప్రియమణి... నేడు ఘనంగా రిసెప్షన్!
జాతీయ అవార్డు సాధించిన సినీ నటి ప్రియమణి, తన ప్రియుడు, వ్యాపారవేత్త ముస్తఫారాజ్ ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో వీరిద్దరూ బెంగళూరులోని జయ నగర రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు. నేడు బెంగళూరు శివార్లలోని ఎలెన్ కన్వెన్షన్ హాల్ లో వీరు వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కొత్త దంపతులు ప్రకటించారు.