: కేంద్ర కేబినెట్ నుంచి ఆరుగురు ఔట్.. జేడీయూ, అన్నాడీఎంకే ఇన్!


కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల బీజేపీకి దగ్గరైన జేడీయూ, అన్నాడీఎంకేలకు కేబినెట్‌లో చోటు దక్కనుంది. మొత్తం 13 ప్రధాన శాఖల్లో భారీగా మార్పులు చేసేందుకు మోదీ, అమిత్‌షాలు సిద్ధమయ్యారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకి ఒక కేబినెట్, సహాయమంత్రి పదవి, అన్నాడీఎంకేకు ఒక కేబినెట్, రెండు సహాయమంత్రుల పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్, ప్రకాశ్ జవదేకర్, జితేంద్రసింగ్‌లకు ప్రమోషన్ దక్కనుంది.

ఇక ఉద్వాసనకు గురయ్యే వారిలో కలరాజ్ మిశ్రా, రాజీవ్ ప్రతాప్ రూఢీ, నిర్మలా సీతారామన్, నడ్డా, కృష్ణరాజ్, సంజీవ్ కుమార్ బల్యాన్ ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రాజీనామాను కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో ఆమోదించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News