: శశికళ తరచూ జైలు నుంచి వెళ్లి ఓ ఎమ్మెల్యేను కలుస్తున్నారు: మరో బాంబు పేల్చిన పోలీస్ అధికారిణి రూప


బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రాజభోగాలు అనుభవిస్తోన్న శశికళకు ముచ్చెమటలు పట్టిస్తోన్న పోలీస్ అధికారిణి రూప మరో  విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. శ‌శిక‌ళ జైలు నుంచి హోసూరు ఎమ్మెల్యే నివాసానికి వెళ్తున్నారని తెలిపారు. అంతేగాక‌, ఇందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని ఏసీబీకి నివేదిక ఇచ్చారు. తాను చెప్పే విష‌యాన్ని ధ్రువీక‌రించుకోవ‌డానికి జైల్లోని 1, 2 గేట్ల మధ్య అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

 జైలులో శ‌శిక‌ళకు అందుతున్న‌ సౌక‌ర్యాల గురించి రూప కొన్ని నెల‌ల క్రితం సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. అధికారులకు శశికళ రూ.2 కోట్లు లంచం ఇచ్చార‌ని కూడా చెప్పారు. ఇందుకు సాక్ష్యంగా వీడియోను కూడా బయటపెట్టారు. ఫ‌లితంగా ఆమెను జైళ్లశాఖ డీఐజీ ప‌ద‌వి నుంచి ట్రాఫిక్‌ కమిషనర్‌గా బ‌దిలీ చేశారు.

  • Loading...

More Telugu News