: ఫ్లాష్ సేల్ లో ‘రెడ్ మి 4’ దక్కించుకోని వినియోగదారులకు శుభవార్త!


ప్రతివారం నిర్వహించే ఫ్లాష్ సేల్ లో ‘రెడ్ మి 4’ మొబైల్ ఫోన్ ను దక్కించుకోలేకపోయిన వినియోగదారులకు శుభవార్త. ఇకపై, ఈ మొబైల్ ను ఓపెన్ సేల్ లో ఉంచనున్నట్టు షియోమి ఇండియా అధికారి మనుకుమార్ జైన్ తెలిపారు. ఈ మొబైల్ ను ఎంఐ ఇండియా లేదా అమెజాన్ వెబ్ సైట్ లో ఓపెన్ సేల్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, రెడ్ మి 4కు సంబంధించిన అన్ని వేరియంట్లను ఓపెన్ సేల్ లో పెట్టలేదని చెప్పారు. కేవలం, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ మాత్రమే ఓపెన్ సేల్ లో లభిస్తుందని చెప్పారు. దీని ధర రూ.10,999గా నిర్ణయించినట్టు తెలిపారు. 2 జీబీ, 3 జీబీ ర్యామ్ కలిగిన రెండు వేరియంట్లను యథావిధిగా ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తామని, ఈ నెల 29న తదుపరి ఫ్లాష్ సేల్ ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News