: మీలాంటి అభిమానులను పొందగలిగాను.. ఇది నా అదృష్టం: చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్ లుక్ టీజర్ ను నిన్న దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారికి చిరంజీవి ధన్యావాదాలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు నిర్వహిస్తున్న ఫేస్ బుక్ పేజీ ‘చిరంజీవి’లో పోస్ట్ చేశారు.

‘ఈ నాటి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులకు, పాలుపంచుకున్న అతిథులకు, నా ప్రియమైన అభిమానులకు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యక్షంగా కలవలేకపోయినా, ఈ మాధ్యమం ద్వారా పరోక్షంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తక్కిన పుట్టినరోజుల కంటే ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. దానికి కారణం ఉంది. నా వృత్తి సినిమా. నా ప్రవృత్తి సేవ. ఈ రెండింటికి సంబంధించిన రెండు అద్భుతమైన ఘట్టాలు ఈ రోజు ఆవిష్కరించబడుతున్నాయి. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగానో, దేశ వ్యాప్తంగానో కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానుల చేతుల మీదుగా జరుగుతున్నాయి.

నా తల్లిదండ్రులు చేసిన పూజలో, నేను చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు కానీ, మీ లాంటి వారిని అభిమానులుగా పొందాను అది నా అదృష్టం. అలాంటి, మీ కోసం నేను ఏం చేయగలను? మీరు గర్వపడేలా సినిమా చేయగలను. పది కాలాల పాటు చెప్పుకునే పాత్రలు చేయగలను. అందుకే, 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర గాథను ఎంచుకున్నా. ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ చేయాలని నాకు ఎప్పటినుంచో ఉంది. అందులోనూ, భగత్ సింగ్ పాత్రలో నటించాలని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకో, కుదర్లేదు. ఇన్నాళ్లకి, ఇప్పుడు ఈ ఉయ్యాలవాడ రూపంలో నా ఆశలకు, మీ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచే పాత్ర దొరికింది....’ అంటూ ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడారు.

  • Loading...

More Telugu News